Friday, June 26, 2015

కృషి రాగం
------------
అప్పుల్లో పుట్టి
అప్పుల్లోఅణగారే
ఆక్రందన
వ్యవసాయం.
-----
దున్నేవాడిభూమిలో
ప్రపంచీకరణ
తిష్టవేసి కూర్చుంటే
మట్టి నడిచే
 మహాప్రస్థానం
సరిగ్గా మశానం వైపు.
---------
బోరెండిన చోట
గుండె పగిలి రైతన్న
చేలోనే శవమై
తేలిపోయాడు.
-----------
గిట్టుబాటుకాని
ధరలతో
దిగుబడినిచ్చే
వ్యవసాయం
దిగాలుకు
సంపూర్ణ  ప్రతిరూపం.

--------------
కలలు ఆకాశంలో
ఆఅశలు అగాధాల్లో
నిజరూపాలు
బేజారు బజారుల్లో
----------------
పల్లెకు
పచ్చనిన
 అమూల్యా భరనం

పరువుదక్కించె  పంటల
హరిత శోభల
సమాహారం..
--------------
ఊరిమొదట్లో
జల కలతో తటాకం
పల్లెతల్లికి
స్వాగతసత్కారాల

-----
ఇంటిట్లో
మల్లెపొద
ఇంటిల్లి పాదికీ
సురభిళపరిమళ
సౌందర్య ప్రవాహం.
---------------

గాబు దగ్గర
 గన్నేరుపూవు,మందారం
పల్లెలోని  కన్నెపిల్లా
జడలకు
సొగసైన అలంకారం
---------------
బయటపాకలో
మూగజీవాలు
పాడీపంటలకు
శుభస్య శ్రీకారాలు.
-------------------------
ఊరంతా
కలిసికట్టుగావుంటే
సమస్యల సమాహారం
ఆమడల దూరం.
-----------------------


No comments:

Post a Comment