అగణిత సత్య బాష
----------------------
నీ వు వివాహాత్పూర్వం
మనోనిబ్బరంతో మనసు నావిష్కరిస్తూ
రాసిన ప్రేమలేఖలనన్నింటినీ
అగాధమౌ జలనిధిలోకి విసిరేసాను.
ఒక్కొక్క అక్షరం-- ప్రణయ వాతూలహతమై
ఆవేదానాంతరంగంతో విలోమ దిశగా తిరిగొచ్చాయి.
అనునిత్యం చిరునవ్వులు చిందించే నీ అమలినమౌ నేత్రాలు
మధురాతిమధురమైన ఆ స్వప్నాలను వెన్నంటి అనుసరిస్తూ
అన్నీ ఆ సానుభూతి సంద్రంలో మునకేసాయ్.
కానీనీవుగానీ నేనుగానీ
విచిత్రాన్ని మనమిద్దరం ఎవ్వరూ గమనించినట్లు లేదు
నేనూ అంత తీక్షణంగానూ దృష్టి సారించలేదు.
కానీ మనమధ్య తనంతట తానే వూపిరులూదిన ప్రణయం
ఈ విపరీత పరిణామాలను గమనిస్తూ
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతూ ఉచ్చ్వాస నిశ్వాసాల సాయంతో
దిగుళ్ళను దిగమింగుతూ ,ఒంటరితనంతో కృంగి కృశిస్తున్నట్లనిపిస్తోంది.
========================================

No comments:
Post a Comment