Thursday, June 25, 2015

నిశ్శబ్దరవం
------------

నిశ్సబ్దరవం
తరంగాలపైతేలియాడుతూ,
మహాసంద్రం అట్టడుగునుంచి
నాదరికొచ్చి పలుకరించింది
మనోజ్ఞంగా నాదమధురంగా
ఓ కెరటం కడలి అంచులోనుంచి తొంగి చూస్తూ.

నిశ్సబ్దరవం
యవ్వనోద్రేకాలకు
నా హృదంతరాళాలను అనునిత్యం స్పృశించి
ఎదను లయబద్ధంగా నాట్యంజేయిస్తూ
మహనందాన్ని మృదువుగా నాకు పరిచయంజేస్తూ.

నిశ్సబ్దరవం
గుండె గొంతుకలోంచి
అందాన్నీ ఆనందాన్నీ
కలబోసిన కమనీయ గళంతో
స్వరాభిషేకానికి సమాయత్తమౌతూ.
=================================

No comments:

Post a Comment