పరిణామక్రమం
-------------------------
చేలు చెరువులై ప్రభవించిన వేళ
చేపలు వికసిత వదనంతో
తమతమ నేత్రాలను నిండారా విప్పార్చుకుని
ముసి ముసిగా నవ్వులు ముఖంపై పులుముకుని
ఆనందంతో తమకూ విదేశీయానం తప్పదని
ఎగుమతి దిశగా ఎదుగుదామని
ఎకసక్కేలతో కాలం గడుపుతున్న సమయాన
చెరువులో కొంతభాగాన్ని అడ్దుకట్టతో విభజించి.
బలహీన వర్గాలవారికి నివేశన స్థలాలుగా ఇచ్చి
వారి ముఖాలపై చిరుమందహాసాలు పులిమిన వేళ
బీదహృదయాలన్నీ సంతోష సాగరంలో మునిగి తేలుతూ
నిండు మనసుతో ప్రభుత్వానికి నీరాజనాలందించే ఘడియలు మొదలయాయి.
ఎగుమతి ప్రస్థాంలో యేర్పడిన ఎగుడు దిగుడులకు
రొయ్యలే కొయ్యబారిన వేళ
చేపలు తాప మందారాల సంద్రాలై ఎర్రబారాయ్
తమ బ్రదుకు తిరిగి తిరిగీ చెరువుకే పరిమితమైపోయినందుకు
విషణ్ణ వదనంతో విచారగ్రస్తమై ఘూర్ణిల్లడం మొదలయింది.
వర్షాభావం వ్యవసాయదారులను వేధిస్తున్న సమయాన
చెరువులోని నిలువచేయబడని నీరు కారణంగా
రైతాంగం డీలాపడి దిక్కులు చూస్తుంటే
మందకొడిగా వ్యవసాయపు పనులు సాగితే
రాష్ట్ర ఆర్ధిక స్తితిగతులు తలక్రిందులౌతాయని
ప్రభుత్వం గాఢంగా నిశ్చయించుకుని
మళ్ళీ చెరువులను జలకళతో కళకళలాడించాలనీ
బహుళ అంతస్తుల భవనాలకు బలహెన వర్గాలను తరలించి
చెరువులన్నింటినీ జలకాసారలుగా తీర్చి దిద్దిన వేళ
ఆకలిబాధకు అర్ధం తెలియనివ్వకుండా
అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వపు ముందుచూపుకు
కృత్రజ్ఞతా ణావంతో తలలు వంచి అభినందించడం
శుభపరిణామమేగాకమరేమిటి?

=============================================
No comments:
Post a Comment