చివరకు మిగిలింది
--------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
మూలాలను పుటుక్కున తెంచుకుని
బంధాలను బాధగా వదిలేసుకుని
నేల మీదకు రాలిపడే శీర్ణపత్రాల్లా
విడివడుతున్న జ్ఞాపకాల దొంతర్లనుచూసి
మేధాక్షేత్రం బావురుమంటున్నది,
విలువల వలువను క్రమేపీ ఊడబెరుకుతున్నది
యూత్ఫుల్ యెంటర్తైన్మెంట్ పేరిట వెండితెర వెల వెలబోతూ
మానవత్వానికి మత చాందసం సమిధలనుపేరుస్తున్నది.
ఉగ్రవాదం పేట్రేగిపోతున్నతీరు
ప్రజావళిని కలవరపెడుతూ కన్నీటిసంద్రాలను సృష్టిస్తున్నది.
ఒకప్పుడు అడవులు నిత్య సౌందర్యలలామల్లా మెరిసిపోయేవి.
ఇప్పుడు ఎర్రచందనం దుంగల దొంగల చేతుల్లో హతమౌతూ
రక్తతర్పణానికి నమూనాలను తయారుచేస్తున్నది.
పశుపక్ష్యాదులుసైతం భయకంపితమై పరుగులు పెడుతున్నవి.
మనిషి గుండెచప్పుళ్ళు తూటా శబ్దాలతో లయతప్పిపోతున్నది.
సాగుతున్న హింసరచనకి ముక్తాయిపు మాత్రం తెలియక మానవత్వం
ఒంటరితనంతో ఘూర్ణిల్లుతున్నది.
కలికాలం కవికులంవైపు దీక్షగాఎదురుచూస్తున్నది
మానవాళి మనసు మారే సమయం ఆసన్నమౌతుందేమోనన్న ఆశతో.
============================================================

No comments:
Post a Comment