Tuesday, June 23, 2015

వాన రాకడ ఆపాత సాంద్రత
అది నిర్వహించే వాతావరణ శాఖకే అంతుబట్టని రహస్యం.
వానలు తొలిసారిగా పడేదాకా మాపల్లెపడే ఆతొలకరి చినుకులకోసం మోరెత్తి ఆకాశానికి ఆశగా కళ్ళనతికించి చూస్తుంటుంది.

నళ్ళటి మబ్బులు నింగినాక్రమించగానే మా పల్లె తల్లడిల్లడం తగ్గించి ముఖానికి చిరునవ్వులు పులుముకుని
నేలనుంచి నింగికెగసే మట్టివాసన నిట్టే పట్టేస్తుంది.

తూనీగలు గాలిలోకెగిరీఅకాశానికి దగ్గరగాజేరి తొలకరి చినుకులకు
స్వాగత వచనాలు పలకాలని శ్రద్ధగా ప్రయత్నిస్తాయి..
గాలిదుమారం దుమ్మూ ధూళీని స్వంతంచేసుకుని
అణువణువునూ తూర్పారబట్టే వైనాన్ని ఇట్టే గమనింస్తుంది.

నేలను అకస్మాత్తుగా చీకటి కమ్ముకుని దశదిశలకూ తిమిరం విస్తరిస్తే
వాన నిలబడికురవడం ఖాయమని గుండెనిండా సంతసాల సముద్రాలను చేర్చుకుంటుంది.

 తేలిపోయే మబ్బులను వెన్వెంటనే తరిమి తరిమి కొట్టాలని
అన్నివేళలా మాపల్లె విజ్ఞాపల పత్రాలనందించి వినయ విధేయతలను ప్రకటిస్తుంది.

చేలలో నేల క్రిందిదాకా దిగిన విత్తనం
శ్సృంఖలాలనన్నింటినీ తెంచుకుని లేలేతగా పైకి పొడుచుకొచ్చే ప్రయత్నం చూడముచ్చటగా వుంటుంది.
అప్పుడుపడే వాన ఎదిగే మొక్కౌన్న పంటపొలాలకు పరిపరివిధాలా
ప్రాణదానంచేసిన దాతగా చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.

శిశిరంలో దిసె మొలతో దీనంగా నిలబడిన తరూ సమూహానికి
శపత్రాల సౌందర్యాలను తొడిగే శేముషీతత్వం తొలకరి వానలకే వుంటున్నదన్నది దాగని సత్యం.
అప్పుడు వాన నిండు పేరోల్లగంలో వివస్త్రయైన ద్రౌపదికి
కృష్ణ భగవానుడందించే అధ్య్యయం నాకు కళ్ళకు కట్టినట్టు స్ఫురిస్తుంది.
 వాన వరదలతో రహస్యపు ఒప్పందాలేమీ కుదుర్చుకోలేదని ముందస్తుగా మావూరు నిర్ధారించుకునే ప్రయత్నంలో సఫలీకృతం కావాలన్నదే మా ఆశయం.
వానను సంకుచిత పరిచే ప్రతి ప్రభుత్వ చర్యనూ మాపల్లె
నిరంతరం నిరశన ధ్వనులతో హోరెత్తిస్తూంటుంది.
ఆక్రమణ పర్వాలకు అనాలోచితమైన ప్రభుత్వ నిర్ణయాలకు
అడ్డుకట్టవేస్తూ అనవరతం జాగ్రత్త వహిస్తూ అన్నీ తానై విహరిస్తూ సహకరిస్తుంది,


No comments:

Post a Comment