Wednesday, June 24, 2015

శ్వేతపత్రం
_________________
తెల్లటి ఈకాగితమ్మీద నల్లటి ఈ గీతలేమిటి?
పడుచు పోరి బుగ్గలమీద పరుచుకున్న ముద్దుల్లా
ఆవేశానికి ఆహుతయే
ఆలోచనారహితయువతమనసులా

నిశ్చలంగా సాగిపోయే బతుక్కి
నిఘం ట్వర్ధం కాదు నే చెప్పేది
చకచ్చకితంగా వెలుగొందిననాడే
జగజ్జేగీయమానంగా ప్రభవించినప్పుడే
బతుక్కి పరిపూర్ణత్వం సంప్రాప్తిస్తుందని
జీ వితానికి ఓ హితబోధచేసా

ఆవేశానికికాదు అధికారం ఆలోచనకుండాలి
ఆశయాలు వల్లిచగలిన కౌశలం గాదు
ఆచరించగలిగే  నైపుణ్యం వుండాలి

అంతే క్షణాల్లో వింత మార్పులు
 చోటు చేసుకున్నాయ్
నీటితో నిండినకొలనులో
ని మ్నో న్నతాలనుకుదిపేపరిణామం
కదలకుండా స్థాణువై నిలిచిన భవితవ్యానికి
కాలచక్రంతో బాటుపరుగులిగిడగలిగిన
విద్యుచ్చాలనం.
==================

No comments:

Post a Comment