నికషోపలం--
---------------
అడుగుతూనేవుంటుంది
అంతరాత్మ
అడ్దగోలుగా నాప్రవర్తన
అవరోధమై నిలిచినప్పుడు.
కడుగుతూనేవుంటుంది
ఆత్మ
కశ్మలాల కశ్మలమై
నా వివేకం అహంభావంతో
విర్రవీగుతున్నప్పుడు.
పడుగు పేకల్లా జీవితం
పరస్పరాశ్రయమై సాగిపోవాలి
ఒడిదుడుకులను లెక్కపెట్టకుండా
ఒద్దికగా జీవితగమనాన్ని
అనుకూలంగా మలచుకోగలగాలి.
చీకటివెలుగుల మధ్యన
బ్రదుకు చిందరవందర కాకుండా
కాపాడుకోగలగాలి.
సుఖదు ఖాలమద్యన బ్రదుకును
సుందర స్వప్నంగా మార్చుకోగల
నేర్పు ఓపును మనం వహించగలగాలి.
చిరునావ్వులతో అంతరాత్మ
చిరంజీవిగా భాసించాలి
అడుగడుగునా ఆత్మ హితబోధలనూ
మనం ఆలకించే సహనాన్ని ప్రదర్శించాలి.
అప్పుడే అంతరాత్మ అమందానంద సంభరిత
ఆత్మ-- నికషోపలమై నిలువగల జీవన గీత
---------------------------------
---------------
అడుగుతూనేవుంటుంది
అంతరాత్మ
అడ్దగోలుగా నాప్రవర్తన
అవరోధమై నిలిచినప్పుడు.
కడుగుతూనేవుంటుంది
ఆత్మ
కశ్మలాల కశ్మలమై
నా వివేకం అహంభావంతో
విర్రవీగుతున్నప్పుడు.
పడుగు పేకల్లా జీవితం
పరస్పరాశ్రయమై సాగిపోవాలి
ఒడిదుడుకులను లెక్కపెట్టకుండా
ఒద్దికగా జీవితగమనాన్ని
అనుకూలంగా మలచుకోగలగాలి.
చీకటివెలుగుల మధ్యన
బ్రదుకు చిందరవందర కాకుండా
కాపాడుకోగలగాలి.
సుఖదు ఖాలమద్యన బ్రదుకును
సుందర స్వప్నంగా మార్చుకోగల
నేర్పు ఓపును మనం వహించగలగాలి.
చిరునావ్వులతో అంతరాత్మ
చిరంజీవిగా భాసించాలి
అడుగడుగునా ఆత్మ హితబోధలనూ
మనం ఆలకించే సహనాన్ని ప్రదర్శించాలి.
అప్పుడే అంతరాత్మ అమందానంద సంభరిత
ఆత్మ-- నికషోపలమై నిలువగల జీవన గీత
---------------------------------
No comments:
Post a Comment