ఉద్దీపన
-----------
నదీనదాలూ కొలనులూ
అలానే చలనమంటూ లేకుండా
స్థాణువుగా నిలిచిపోతే
ప్రవాహానికి ఆ పేరెందుకొస్తుంది?
-----------
నదీనదాలూ కొలనులూ
అలానే చలనమంటూ లేకుండా
స్థాణువుగా నిలిచిపోతే
ప్రవాహానికి ఆ పేరెందుకొస్తుంది?
జలాశయాలకు ఆ జీవకళెలా నిలుస్తుంది ?
వాటి మనుగడ ధన్యమయే
వీలెక్కడకలుగుతుంది?
ప్రదేశాన్ని బట్టే ప్రవృత్తీ మారిపోతుంది
ఉనికి ననుసరించే ఉత్కృష్టత
ఉద్దీపనమై వెలుగొందుతుంది
వాటి మనుగడ ధన్యమయే
వీలెక్కడకలుగుతుంది?
ప్రదేశాన్ని బట్టే ప్రవృత్తీ మారిపోతుంది
ఉనికి ననుసరించే ఉత్కృష్టత
ఉద్దీపనమై వెలుగొందుతుంది
ఎడారిలో నీటిచలమను చూడండి
తడారిపోయిన గొంతు కలలకు
అమృతవాహినిగా గోచరిస్తుంది
ఆశావహులకు ఆనందమే
జీవనదన్నట్లు భాషిస్తుంది
తడారిపోయిన గొంతు కలలకు
అమృతవాహినిగా గోచరిస్తుంది
ఆశావహులకు ఆనందమే
జీవనదన్నట్లు భాషిస్తుంది
నిరాశానిస్పృహ లావరించిన జీవులకు
నిమ్నోన్నతాలను కుదిపేసి
చైతన్య స్రవంతియై దర్శనమిస్తుంది
జవజీవాలను ప్రసాదించి
జాతికి గర్వకారణమై నిలుస్తుంది.
ఉనికిననుసరించే ఉత్కృష్టత
ఉద్దీపనమై వెలుగొందుతుంది
ప్రదేశాన్ని బట్టే ప్రవృత్తీ మారిపోతుంది .
నిమ్నోన్నతాలను కుదిపేసి
చైతన్య స్రవంతియై దర్శనమిస్తుంది
జవజీవాలను ప్రసాదించి
జాతికి గర్వకారణమై నిలుస్తుంది.
ఉనికిననుసరించే ఉత్కృష్టత
ఉద్దీపనమై వెలుగొందుతుంది
ప్రదేశాన్ని బట్టే ప్రవృత్తీ మారిపోతుంది .
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
No comments:
Post a Comment