Saturday, June 20, 2015


విహంగ వీక్షణం
------------------------రావెల
నగరం నాకెందుకో బుసకొట్టే త్రాచుపామును గుర్తుకు తెస్తుంటుంది.

కాలుష్యం పూర్తిగా కాటేసినట్లుండే నెత్తిమీద లుంగలుచుట్టుకునే కారుపొగల కర్బనపు వాయు సంచారం

సగటున రోజుకొకరినయినా తప్పక తనలోకి లీనం చేసుకునే

సాగర్ నీటి జలదృశ్యాల అఘోరింపుల ఆన వాళ్ళు
వేగాన్ని అధికంచేసివెళుతూ  వేరయిపోతున్న జీవన శృతుల సందర్భాలు.
అత్తగార్లకెవరికీ అపకారం తలపెట్టకపోయినా
కోడళ్ళ చీరె కొంగుల కంటుకుని స్వాహాచేస్తున్న గ్యాస్ స్టౌ లీకెజీల ప్యాకేజీలు.
ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా రంగు పులుముకుంటున్న రాజకీయ విన్యాసాలు.
ఎదురుతిరిగితే చాలు తిరిగిరానిలోకాలకు ఎగుమతిఔతున్న నిజంగా యజమానులైన బక్క ప్రాణులు.
 యంత్రాంగమంతటా కందెనలా పూసుకుపోతున్న అవినీతి మంత్రాంగాలు.
సూప్రభాతం నుండీ  సూర్యాస్తమయందాటినా ఎడతెగని నేతల వాగ్దానాల సూక్తిముక్తావళులు.

అర్ధరాత్రి దాటాక కూడా ఆబాలగోపాలం తాగి తైతక్కలాడేందుకు బారులుతీర్చి రారమ్మంటున్న బార్లు.
వేయిపడగల్లా విస్తరిస్తూ పోతున్న కల్తీ వాణిజ్యాల కరకు కషాయాలు.
పెద్ద బ్యాంకు అనుమతిలేకుండానే ప్రజలధనాన్ని ఊరగాయముక్కల్లా నంజుకు తింటున్న అన్యాయాలనంటిపెట్టుకుని మసలే  లావాదేవీలు.
వయసునొసటిపై ముసలి రేఖలు ముద్రించినా ప్రజాసేవంటూ బరితెగిస్తున్న రాజకీయ జంబుకాలు.
అన్ని అరాచకాలకూ అకృత్యాలకూ మా అండదండలుంటాయని భరోసాగా నిలబడుతున్న రక్షక భటనిలయాలు.
బైకులమీద షికార్లకీ రాత్రిపూట ఖరీదయినహోటళ్ళలో  భోజనాలకూ
ఎరయి పోయి శీలరహితంగా శిలాజాల్లా నిలబడిన లవ్లీ కుర్రకారు
లాస్య విహంగ వీక్షణాల భ్రమల్లో తేలిపోతున్న కుర్రకారు ప్రణయమనే పైత్య ప్రకోపాలు.
అన్నీ కలగా పులగంగా నాగరకత పేరిట మంచితనాన్ని నంజుకుతిని వదిలేస్తూ
వేధిస్తున్న  నయగారాల నగరహొయలు

No comments:

Post a Comment