Friday, June 26, 2015

చేదుపొర
------------
అర్ధరాత్రయినా అపరాత్రయినా
అత్యవసరంగా తలుపు తట్టి
చేతుల్లో ఒ కాగితం పెట్టి
టెలిగ్రామంటూ భయపెట్టే కాలం
చెల్లిపోయే అశుభసమయం ఆసన్నమైంది.
------
సీరియస్ వేంటనే కదలిరండంటూ
త్వరపెట్టే సమాచార స్రవంతికి
అడ్దు కట్ట పడిపోయింది.
అంతేమరి అందరం ఆధునికతను అంటి పెట్టుకోవాలని
తహతహ పడుతుంటే నాఉనికే ప్రశ్నార్ధకమయిందని
తంతి శోకరువు పెట్టడం మొదలెట్టి చాలా కాలమయింది.
ఉత్తరాల వూసుల్లాగా యస్టీడీ బూతుల అదృశ్య ప్రస్థానంలా
ఒక్కో సుమధుర జ్ఞాపకం కనుమరుగయే ప్రక్రియ ప్రారంభమయింది.
ఒక్కో మధుర స్మృతీ అగాధాల అంచుల్లోకి కాలం పుటల్లోని
అట్టడుగు పొరల్లోకి జారుకోవడం ఖాయమయి పోయింది .
మహాప్రస్థానం మొదలయింది తంతి ప్రక్రియకు
అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమయింది
అందారూ విచ్చేయండి ఆఖరి శ్వాస విడిచేసే తంతి కి
చిట్ట చివరి చూపును మనకందించే అవకాశం ప్రసాదిద్దాం రండి
అందరూ మూకుమ్మడిగా విచ్చేసి మన శోకసందేశం హృదయతాపం
ప్రత్యక్షంగా తెలియజేద్దాం తరలిరండి .తరించండి 
===========================

No comments:

Post a Comment