Friday, June 19, 2015

దాదాపు యేణ్ణర్ధంపాటు
చుక్కనీరుపోసేదిక్కులేక
నీరుపోసే నాధుడికోసం
వేల కన్నులను విప్పార్చుకుని
దీనంగా ఎదురుచూసిన పూలచెట్లు
నారాకతో నవ్వులు చిందిస్తూ
అమ్మయ్య అనుకుని మళ్ళీ ఊపిరితీసుకుని
ఎండలన్నింటినీ ఏదోలా తట్టుకునినాలుగు
 చినుకులు నెత్తిమీద పడగానే
వాటినే దివ్యాక్షతలుగా
సువర్ణాశీర్వాదముగా స్వీకరించి
కొంతగా కొంత  బలం కోసం పొడిమందు జల్లగానే
మరచిపోయాయనుకున్న నవ్వులు మళ్ళీ
 ప్రతిధ్వనించడం మొదలెట్టాయ్.
ఆపూల చిరుమందహాసాలకొసల్లో
ఆమె అమందానంద కందళిత హృదయం
ఆవిష్కృతమైనంత ఆనందం నన్ను
ఉక్కిరిక్కిరిచేస్తున్న వేళ ఎప్పుడూ
కనీ వినీ ఎరుగరాని పదాలకోసం
వెదుకులాట ప్రారంభమయింది.

చూద్దాం ఈ సంతోషం ఆయుస్షు ఎన్నాళ్ళో--
ఈ ఆనందం ఎన్నాళ్ళు బట్టగట్టి బ్రదుకునీడుస్తుందో!!!
---------------------------------------------------------------


==========================================

No comments:

Post a Comment