ప్రణయాంజలి.-1
--------------
ప్రణయినీ!!
ఎవరివి?నీవెవరివి?
హిమవన్నగముపై మెరిసే
హేమంత శీతల తుషార బిందువువా?
వసంత కాలంలోచిగురించే
వర్ణ పర్ణ శాలయందలి
మెరిసే హరిత సుందరివా?
మండుటెండలోసైతం
గుబాళించే మల్లెపూల
సురభిళ పరీమళ
మరంద మాధురివా?
కలల కౌగిలిలో కరగి
ప్రవహించే కమనీయ మృదుహాసమువా?
క్షుభిత హృదయాలను శాంతపరిచే
శుభంకర సందేశమవా?
ఏదిఏమైనా నాజీవన పధంలో
నీవొక అమృతానంద ఝరివి
నువ్వు అక్షరాలా నా దానివి
నిరoతరo నాలో నినదించే నాదానివి.
--------------
ప్రణయినీ!!
ఎవరివి?నీవెవరివి?
హిమవన్నగముపై మెరిసే
హేమంత శీతల తుషార బిందువువా?
వసంత కాలంలోచిగురించే
వర్ణ పర్ణ శాలయందలి
మెరిసే హరిత సుందరివా?
మండుటెండలోసైతం
గుబాళించే మల్లెపూల
సురభిళ పరీమళ
మరంద మాధురివా?
కలల కౌగిలిలో కరగి
ప్రవహించే కమనీయ మృదుహాసమువా?
క్షుభిత హృదయాలను శాంతపరిచే
శుభంకర సందేశమవా?
ఏదిఏమైనా నాజీవన పధంలో
నీవొక అమృతానంద ఝరివి
నువ్వు అక్షరాలా నా దానివి
నిరoతరo నాలో నినదించే నాదానివి.
No comments:
Post a Comment