దృశ్యా దృశ్యంగా
---------------------రావెల
*********************************
నాకుమాత్రం ప్రతిసన్నివేశాన్ని
కూలంకషంగా నివేదించాలన్న తపన
ప్రతిసందర్భాన్నీ
పూసకు గుచ్చినట్లు
గుది గుచ్చిమరీ వివరించాలన్న దుగ్ధ.
కవిత్వమంటే వాస్తవస్తవమేనని
నాకెందుకో ప్రగాఢ విశ్వాసం.
సంతోషమైనా
సంతాపమైనా
సన్నిహితులతో
సమీప బంధువులతో
సాక్షరంగా
పంచుకోవాలని కాంక్ష.
సహజత్వానికి భిన్నంగా
కనుపించేదయినా కలగుండులా
నా గుండెపొరల్లోకిదూరి గొడవచేస్తుంది.
అందుకే అడవి మధ్యలోనయినా,
అది ఓ నగరం నడిమయాన
జనబాహుళ్యంతిరుగాడే
చౌరస్తాలోనయినా
పర్వత సానువులపైనయినా
ఓ అమాయకు పక్షిలాంటి పసిప్రాణాన్ని
పెడరెక్కలు విరిచికట్టి గుందెలోకి
క్రూరాతి క్రూరంగా
ఓ తుపాకీ గుండును
దించారని గ్రహించినప్పుడు
నాకలంలో ప్రవహించేది సిరాగాదు,
రక్త ప్రవాహమే
ఎరుపెక్కిన నా నేత్రద్వయం నుండి
రాల్చేది మాత్రం రగిలే రక్తాశ్రువేలేన్నది
అక్షర సత్యం.. ఇదంతా వాస్తవస్తవం
--------------------------------------
[అమాయకంగా "వివేక" వంతులయిన ప్రాణాలు
గాలిలోకలిసాయని వార్త విన్నప్పుడు-- స్పందన]
---------------------రావెల
*********************************
నాకుమాత్రం ప్రతిసన్నివేశాన్ని
కూలంకషంగా నివేదించాలన్న తపన
ప్రతిసందర్భాన్నీ
పూసకు గుచ్చినట్లు
గుది గుచ్చిమరీ వివరించాలన్న దుగ్ధ.
కవిత్వమంటే వాస్తవస్తవమేనని
నాకెందుకో ప్రగాఢ విశ్వాసం.
సంతోషమైనా
సంతాపమైనా
సన్నిహితులతో
సమీప బంధువులతో
సాక్షరంగా
పంచుకోవాలని కాంక్ష.
సహజత్వానికి భిన్నంగా
కనుపించేదయినా కలగుండులా
నా గుండెపొరల్లోకిదూరి గొడవచేస్తుంది.
అందుకే అడవి మధ్యలోనయినా,
అది ఓ నగరం నడిమయాన
జనబాహుళ్యంతిరుగాడే
చౌరస్తాలోనయినా
పర్వత సానువులపైనయినా
ఓ అమాయకు పక్షిలాంటి పసిప్రాణాన్ని
పెడరెక్కలు విరిచికట్టి గుందెలోకి
క్రూరాతి క్రూరంగా
ఓ తుపాకీ గుండును
దించారని గ్రహించినప్పుడు
నాకలంలో ప్రవహించేది సిరాగాదు,
రక్త ప్రవాహమే
ఎరుపెక్కిన నా నేత్రద్వయం నుండి
రాల్చేది మాత్రం రగిలే రక్తాశ్రువేలేన్నది
అక్షర సత్యం.. ఇదంతా వాస్తవస్తవం
--------------------------------------
[అమాయకంగా "వివేక" వంతులయిన ప్రాణాలు
గాలిలోకలిసాయని వార్త విన్నప్పుడు-- స్పందన]
No comments:
Post a Comment