Thursday, June 25, 2015

తరుచ్చాయ
----------

తలతెగిపడ్దతరువుల్లోంచి
తన్నుకొచ్చిన చివురులనడిగితే
ఆస్పర్శ ఎంత మృదువైనదో
ఇట్టే అవగతమయేలా వివరిస్తాయి.

యేపదాలకూ అందనంతగా
అది నా ఎదలోతులను తాకి
తన్మయత్వంతో పరవశయై నిలిచింది.

అదీ ప్రాణుల విజయమంటే
అదేగదా మృత్యు ముఖానికి
పరాజయమన్నపదానికినిఘంట్వర్ధం.

ఎప్పుడూ కప్పలా ప్రపంచాన్ని కప్పెడుతూ
అదేగొప్పతనమని భావిస్తే
అది దిద్దుబాటుకునోచుకోనిపొరపాటై
చరిత్రపుటల్లో చిరస్థాయిగా కళంకమై  నిలుస్తుంది.
అదే ఎదుగుదలనుసర్వం సహా నిరోధించే
ఎడబాటుగా పరిణమించి అల్పజీవులను భయ విహ్వలులను గావిస్తుంది.

ప్రవాహ శీలమైన కదలిక
ప్రత్యణువులోనూ ప్రశమించగలగాలి.

జవాబులకోసంప్రశ్నించే ధోరణి
పసితనాన్ని ప్రధమగా మసిబూసుకోకుండా
కాపాడగలగాలి.
జీవనయానంలో వెదుకులాటకు దూరంగాచేసి
వృద్ధాప్యాన్ని సముదాయించగలగాలి.

అప్పుడే జీవితగమనానికి ఓ తోడూ ,నీడా సంప్రాప్తించడానికి వీలు కలిగి
చిరంతనంగా శోభిల్లుతుంది సప్తస్వర ధునిగా.
==============================================



---

No comments:

Post a Comment