Saturday, June 27, 2015

కిం కర్తవ్యం

మనిషి తనంతట తాను
చీకటిలొ కలిసిపొతున్నాడు
వెలుగురేకలకందనంత దూరంగా
వేగంగా జరుగుతూ పోతున్నాడు
ఒక్కోసారి మనిషి
తానే విషాద సంద్రమై ప్రవహిస్తున్నాడు
అగాధాల అట్టడుగు దాకావెళ్లి
అదృశ్య రూపందాలుస్తున్నాడు.

గాలిని స్తంభింపజేస్తానని
గప్పాలు పలుకుతున్నాడు
కడుపులో శివలింగాలున్నాయని
కధలెన్నో అల్లు తున్నాడు

ఎందుకని మనిషి ఇలా
దిగజారి ప్రవర్తిస్తున్నాడు?
సంస్కృతీ సంప్రదాయాలకు
సవాలుగా పరిణమిస్తున్నాడు?

పరులమేలుకోర[లే]ని
పశువులా మారిపోతున్నాడు
ఇతరుల బాగుచూసి ఓర్వలేని
కన్నుకొట్టేటి విషాద మేఘమై
వెలవెల బోతున్నాడు

భ్రమలవికసనంలో
భ్రష్టహేతువై నిలుస్తున్నాడు
మానవత్వపు చాయలనుమకిలబరచి
మరో దిశగా పయనిస్తున్నాడు

No comments:

Post a Comment