Tuesday, June 30, 2015

భవదీయం
----------------
గిరులలో
తరులలో
గాలికి సయ్యాటలాడే
వేలపూల గుండెల్లో
కదిలాడే కల్పనవు.
జలాలగలగలలలో
జవ్వనుల మేని పై మెరిసే
తళుకు బెళుకులలో
పచ్చని పైరుల రెపరెపలలో
అనునిత్యం హసించే
అమందానంద కందళిత
సుందర హృదయారవిందవు.

వలపు గీతాల వసంత కాలం
వరుమానంగా అందించిన
అమూల్యమౌ వరానివి.
నవభావా విభావరిలో
ననలెత్తిన కొత్త తరానివి.
============================
[అప్పట్లో విశాఖ నుండి వెలువడిన 'ఈనాడు' దినపత్రికలో
28-10-1976 సంచికలో పతాక శీర్షికలో ప్రచురితమైన కవిత]

No comments:

Post a Comment