ముద్రారాక్షసం
-------------------------------
నువ్వు నాప్రణయినివి
పాతికేళ్ళ నాజీవితాన్ని
ప్రభావితంజేసిన
ప్రేమామృత రసధునివి.
నీవేనాజీవన సర్వస్వమనీ
నీవే నామృదుభావ సంజీవనివనీ
కలలుగని అక్షరాలా ఉప్పొంగిపోయాను .
నీరూపాన్ని పదే పదే నెమరువేస్తూ
మురిసి మెరిసి విహంగంలా విహరించాను.
ఆకులురాలిపోతున్నవేళ
ఆశలు అమాంతంగా కూలిపడిపోతున్నవేళ
మరొకరితో నీ పాణిగ్రహణ
మహోత్సవం జరుగుతున్న వేళ
భావికాలంలో నాజీవితాన్ని
బాధల గాధగా మిగిల్చిన నీవు
నాప్రళయినివి.
అచ్చుతప్పుల సామ్రస్యాన్ని
ఆనందంగా అనుభవిస్తున్న నాదానివి.
[ఈనాడు[విశాఖ]లో 19-7-1976 నాడు ప్రచురితం]
-------------------------------
నువ్వు నాప్రణయినివి
పాతికేళ్ళ నాజీవితాన్ని
ప్రభావితంజేసిన
ప్రేమామృత రసధునివి.
నీవేనాజీవన సర్వస్వమనీ
నీవే నామృదుభావ సంజీవనివనీ
కలలుగని అక్షరాలా ఉప్పొంగిపోయాను .
నీరూపాన్ని పదే పదే నెమరువేస్తూ
మురిసి మెరిసి విహంగంలా విహరించాను.
ఆకులురాలిపోతున్నవేళ
ఆశలు అమాంతంగా కూలిపడిపోతున్నవేళ
మరొకరితో నీ పాణిగ్రహణ
మహోత్సవం జరుగుతున్న వేళ
భావికాలంలో నాజీవితాన్ని
బాధల గాధగా మిగిల్చిన నీవు
నాప్రళయినివి.
అచ్చుతప్పుల సామ్రస్యాన్ని
ఆనందంగా అనుభవిస్తున్న నాదానివి.
[ఈనాడు[విశాఖ]లో 19-7-1976 నాడు ప్రచురితం]
No comments:
Post a Comment