అదే భాగ్యము--
-----------------
హరితవనంలో రరువులచాటున నక్కి
తొంగిచూస్తున్న చందమామ అందం
నిన్ను సౌందర్య రాశిగా తీర్చి దిద్దడం పూర్తయింది.
అమీ వేగంగా జలజల పారే సెలయేతిగలగలలా ఆనందం
అంచుల వెంటనంటి
ప్రవహించే నదీమతల్లి వెదజల్లేతుంపర్లతో
కేరితలుకొడుతూ నువ్వు గాఢంగా నన్ను హత్తుకున్న
మధుర క్షణం నా స్మృతిపధంలో అమృతఝరులనింకా ఊరిస్తునే వుంది.
ఎదురింటి పూరిపాకలో చిన్నపాటి చిల్లునేర్పరచుకుని
ధారాపాతంగా కురిసే వానజల్లుకు నీటిమడుగై భయపెడుతున్నప్పుడు
అసంకల్పితంగా నువ్వు నా అధరాలను చుంబించిన శుభధడియలింకా నా మనో పధంలో తీయ తీయగా
రుచులనూర్ర్స్తూనే వున్నది.
తనువును కజ గజా వణికించే చలిగాలికి ఒగుడాకులా నేను
వణుకుతూ వుంటే
అగ్నిశిఖలా ఎదురొడ్ది నిలిచి నాలో శృంగారపు రసోద్దీపనం కలిగించే నీ నిబ్బరం నన్ను నిశ్చేష్టుడిని చేస్తూ వుంటుంది.
ఎవరిని ఎవరం విడిచి మనలేమని క్షుణ్ణగా అర్ధమై పోయింది.
ప్రేమ మనలను భాగ్యవంతులుగా చేసి మురిపిస్తుంటే
భువికి నాకొసమే యేతెంచిన దివ్య భామినివి నీవనీ
పులకింపజేసే మధుర భావన నన్ను విస్మయింపజేయడం వింతేమీకాదుగా!!--

No comments:
Post a Comment