సర్వ శ్రేష్ఠ
----------------------
ఆమెవేళ్ళు అతిసున్నితంగా
అత్యంత సుకుమారంగా
నాట్యం చేయడం మొదలెట్టాయి.
మంచానికి నులకనల్లడానికి
ఎంత ఓర్పూ,నేర్పూ కావాలో
అప్పుడర్ధమయిందతనికి
ఎంత కష్టతరమైన విద్యో అవగతమయింది.
అక్కడక్కడా పుల్లను గుచ్చుతూ
దానిచుట్టు నులక వుండను తిప్పుతూ
దగ్గర దగరగా నులకనల్లుకుంటూ
అవసరానికనుగుణంగా పుల్ల స్థానాన్ని
మార్చుకుంటూ అల్లుకుంటూ పోవడం కష్టమేమరి,
అందుకేనేమో ఆమె సంసారాన్ని
అతి చాకచక్యంగా నడిపించుకుంటూ
అగ్ర శ్రేణికోవలో కి ఎగబ్రాకగలిగింది.
అక్కడక్కడా అనుకోకుండా తలెత్తే
అపస్వరాల నధిగమిస్తూ
జీవన పధాన్ని సుగంగా సునాయాసంగా
అషిగమిస్తూ అందరి ప్రశంశలనందుకుంటున్నది.
మనసులోనే చిక్కుముడులను విప్పుకుంటూ
పెదాలపై సహజంగా అలంకృతమయే
చిరునవ్వును చెదరనీయకుండా కాపాడుకుంటూ
ఆమె సంసారంలోని ఉరుకులు పరుగుల జీవితాన్ని
అలవోకగా అందిపుచ్చుకుని జీవన యానం
సుఖప్రదంగా శుభంకరంగా సాగిస్తున్నది.
----------------------
ఆమెవేళ్ళు అతిసున్నితంగా
అత్యంత సుకుమారంగా
నాట్యం చేయడం మొదలెట్టాయి.
మంచానికి నులకనల్లడానికి
ఎంత ఓర్పూ,నేర్పూ కావాలో
అప్పుడర్ధమయిందతనికి
ఎంత కష్టతరమైన విద్యో అవగతమయింది.
అక్కడక్కడా పుల్లను గుచ్చుతూ
దానిచుట్టు నులక వుండను తిప్పుతూ
దగ్గర దగరగా నులకనల్లుకుంటూ
అవసరానికనుగుణంగా పుల్ల స్థానాన్ని
మార్చుకుంటూ అల్లుకుంటూ పోవడం కష్టమేమరి,
అందుకేనేమో ఆమె సంసారాన్ని
అతి చాకచక్యంగా నడిపించుకుంటూ
అగ్ర శ్రేణికోవలో కి ఎగబ్రాకగలిగింది.
అక్కడక్కడా అనుకోకుండా తలెత్తే
అపస్వరాల నధిగమిస్తూ
జీవన పధాన్ని సుగంగా సునాయాసంగా
అషిగమిస్తూ అందరి ప్రశంశలనందుకుంటున్నది.
మనసులోనే చిక్కుముడులను విప్పుకుంటూ
పెదాలపై సహజంగా అలంకృతమయే
చిరునవ్వును చెదరనీయకుండా కాపాడుకుంటూ
ఆమె సంసారంలోని ఉరుకులు పరుగుల జీవితాన్ని
అలవోకగా అందిపుచ్చుకుని జీవన యానం
సుఖప్రదంగా శుభంకరంగా సాగిస్తున్నది.
No comments:
Post a Comment