Wednesday, June 24, 2015

ఉషోదయం
--------------
పూలు తమ సురభిళ పరిమళాలను
వెదజల్లేసమయం ఆసన్నమైనప్పుడు,
మలయ మారుతాలు శీతల స్పర్శతో మమేకమై
మన తనూలతలను చంచలించిపోయేలా చేసినప్పుడు


అప్పుడే పొటమరించిన లేచివుళ్ళు
అంగీకార సూచకంగా తమ తలలాడించినప్పుడు
నడిసంద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు
సందర్శకులకు పాదాభివందనం చేయ తతహ పడుతున్నప్పుడు
ప్రియా గుర్తుంచుకో ! మరువకు !!
నీ హృదయగతిన అలజడులను మానిపి


నిర్మలంగా నిష్కల్మషంగా
ఆశాఉషస్సులను ఆ విష్కరించే వేళయిందని అర్ధంచేసుకో--
============================================================

No comments:

Post a Comment