తస్మాత్ జాగ్రత్త
===============
చీకట్లోంచి వెలుగులోకి నెమ్మదిగా అడుగులేసే జీవిని చూస్తే
భయమన్న ది కలుగదు బాధన్నది ససేమిరా పడలేం
సహజధోరణిలోనేసర్దుకుపోయే ప్రయత్నం జేస్తాం
బెరుకనేది పడకుండా చిరాకును ప్రకటించకుండా
వెలుగులోంచి వడి వడి గా వెదుక్కుంటూ
వచ్చి వచ్చి మనలనుగూడా ఆ తిమిరకుహరాల్లోకి
లాగాలనుకునే చెదపురుగును చూసినప్పుడు మాత్రం
ఒక్కసారిగా చిన్న సైజు వణుకు, ఒళ్ళంతా గగుర్పాటు
ఊహించని పరిణామాలతో ఉబికివచ్చే దఃఖపు దాఖలాలు
అసహ్యాన్ని కలిగిస్తూ అభద్రతాభావాన్ని యేర్పరుస్తుంది.
అంధకారంలోకి తనే జారిపోతూ అప్రదిష్ట పాలవుతున్నాడు
వినయశీలాన్ని అలవరుచుకోలేని విద్యావంతుడై
నికృష్టజీవిగా నిలిచిపోతున్నాడు కలియుగపు మనిషి.
లజ్జాభయంలేని కామాతురుడై మిగిలిపోతున్నాడు
ఉపకారికి అపకారం తలపెట్టే
ఉన్మాదప్రవృత్తిని అలవరుచుకుంటున్నాడు
వృత్తికి కళంకం తెచ్చే వ్యర్ధజీవిగా చరిత్ర హీనుడై నలిగిపోతున్నాడు
అతను ఎంతటి ఘనుడైతేయేం
కళ్ళకు కామం,పొరలుగమ్మినప్పుడు
లేలేతమొగ్గలను తుంచేప్రయత్నంలో మిగిలిపోతున్నాడు
ప్రేమ , ప్రణయం, పెళ్ళి అంటూ
కసుగాయలను బెదరించేప్రయత్నంలో మునిగిపోతున్నాడు .
అతడు చేసే రాసక్రీ డలకు సాటి యేరాక్షస క్రీడలూ సాటి రావంటే నమ్మండి .
అతడికి కీలెరిగి వాతలంటూ పెట్టకపోతే అచ్చోసిన ఆంబోతులా
పిచ్చెక్కిన శునకంలా
మనోదౌర్బల్యంతో రెచ్చిపోతాడు సుమా!
తస్మాత్ జాగ్రత్త
==========================