కొత్త హామీ పత్రం--
-------------------------రావెల
==================================
ఇప్పుడుమా ఇంట్లో కొత్తపూలు పూస్తున్నాయి
పాత చెట్టుకు పూసిన పూలన్నె ఇప్పుడేందుకో
గవులు కంపు కొడుతున్న అనుభూతి నన్ను
అప్రతిభుడిని గావిస్తున్నది.
పాత చెట్టుకు పూసిన పూలను మొగ్గలోనే తుంచి
కొత్త మొక్కలకు పచ్చిరొట్ట ఎరువుగా వాడాలి ఇకముందు.
ఇంటి చాకిరీ అంతా పాపం కొత్త తల్లిమీద పడుతున్నది.
హల్లోల హాలాహలంతో దిగజారుతున్న ప్రతిష్టతో సతమవుతున్న
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగమండీ నేను వెలగబెడుతున్నది.
అయ్యో మొదటిపెళ్ళాం కేమీకాలెదండీ ఆవిడను కొత్తమోజులో
ఇంటికి దూరంగా నెట్టేసి కొత్తపరుపుమీద నవ్వులను నజరానాగా పొందుతున్న అదృష్టవంతుడిని.
ఇంటిచాకిరీకి పనిమనిషెందుకని ఉన్నకూతురినే అన్ని పనులకూ
వినియోగించడంలో విఫలం కాకుండా జాగ్రత్త పడుతున్నాను.
విసుగుపుట్టించినప్పుడో మనసు వైవిధ్యంకోసం ప్రాకులాడినప్పుడో
కాలిన గరిటతోనో--కట్టుకున్న తోలు బెల్టును విప్పో దండోపాయాన్ని ప్రయోగిస్తున్నాను.
ఇవన్నీ థర్డ్ డెగ్గ్రీ హింసలనుకుంటున్నారా కాదండీ 4 డీ హింసలండీ నేనే కొత్తగా కనిపెట్టాను ప్రయోగదశలో వున్నాయి
సఫలీకృతంకాగానే మీకు తెలియజేసి బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్ది మీ ప్రశంసలనందుకుంటానని హామీ.
ఇది ఎవరి హింసా ప్రవృత్తికీ అనుకరణగానీ అనువాదంగాదని హామీ సుమా!
పోలీసులతో బాలలహక్కుల పరిరక్షణ బృదం ఇక్కడకు రావడమా? ఇదేం చోద్యమో మీరే చెప్పండి కన్నది నేను హింసిస్తున్నది నేను, మధ్యలో ఈ గన్నాయిగాండ్లకేంటట. ?

No comments:
Post a Comment