Wednesday, July 1, 2015

విద్యుల్లేఖ

--------


నీవు స్వేదకెరటమై వర్షించడం మొదలెడితే
వేసవి సమీపించిందన్న స్పృహ నాలో పొటమరించింది.

నీవు గజ గజవణుకుతూ ఘనీభవిస్తుంటే
చలికాలం ఆసన్నమైందని ఉన్ని దుస్తులకు ఊపిరులూదాను.
నీవు యే ఆఛ్చాదననూ  ధరించనుంకించనప్పుడు
శిశిరశిశిరపు వాతూలం  వీస్తున్నదని ఇట్టే అవగతమయింది.

నామనసు, శరీరం, ఆత్మా అన్నీ ఒక్కుదుటన  పులకితవదను లవడం ప్రారంభిస్తే
 అప్పుడిక అర్ధమయింది ప్రియతమా!
మన ప్రణయం వసంత శోభనిట్టే హత్తుకుని
పరవశయై నాఎదుటన పున్నాగపూవులా పరిమళించడం
ప్రణయోద్దీపనకు సమయం ఆసన్నమైనదని ఇక ఆహ్వానపత్రాల
నత్తొంచిడమే మేలని శుభంకరమనీ అర్ధమయిపోయింది సుమా!!

No comments:

Post a Comment