మరింకే ప్రస్థానం?
----------------------
ఒంటరిగా విహాయసంలో ఎగురుతూన్న పక్షి
కైందన ఉరవళ్ళతో పరవళ్ళతో ప్రవహిస్తున్న
ప్రవాహ దృశ్యాన్ని గూర్చి భయపడడం లేదు.
దూరంగా ఎత్తుగా కనబడుతున్న
దేవాలయ గోపురం మీదనే మనసంతా
కేంద్రీకృతమై సాగుతున్నది తన ప్రయాణం.
నదీమతల్లి ఒడిలో ఎగసిపడే కెరటాల్లా
ఒడిదుడుకులు జీవనయానంలో సత్యమని
గుర్తెరిగిననాడు దు: ఖభాజనులం కావాల్సిన
అవసరం ఇట్టే కనపట్టదు.
దూరదూరతీరాలకు సాగే యానంలో
లక్ష్యం మీద వుండవలసిన గురిని
అలక్ష్యం చేయడం భావ్యం కాదుగదా!!
నింగిలో విహరించే విహంగమైనా
నేలమీద శ్వాసించే ప్రాణి ఎవరయినా
గితవచనంగా దీనిని స్వీకరించడమే
సుభాషితమనీ అదే జీవనగీతై
భాషిస్తుందనీ గ్రహించగలిగిన వాడే
మేధావి వర్గం కోవలోకిజేరి కులుకుల ప్రస్థానం సాగిస్తాడు.
----------------------
ఒంటరిగా విహాయసంలో ఎగురుతూన్న పక్షి
కైందన ఉరవళ్ళతో పరవళ్ళతో ప్రవహిస్తున్న
ప్రవాహ దృశ్యాన్ని గూర్చి భయపడడం లేదు.
దూరంగా ఎత్తుగా కనబడుతున్న
దేవాలయ గోపురం మీదనే మనసంతా
కేంద్రీకృతమై సాగుతున్నది తన ప్రయాణం.
నదీమతల్లి ఒడిలో ఎగసిపడే కెరటాల్లా
ఒడిదుడుకులు జీవనయానంలో సత్యమని
గుర్తెరిగిననాడు దు: ఖభాజనులం కావాల్సిన
అవసరం ఇట్టే కనపట్టదు.
దూరదూరతీరాలకు సాగే యానంలో
లక్ష్యం మీద వుండవలసిన గురిని
అలక్ష్యం చేయడం భావ్యం కాదుగదా!!
నింగిలో విహరించే విహంగమైనా
నేలమీద శ్వాసించే ప్రాణి ఎవరయినా
గితవచనంగా దీనిని స్వీకరించడమే
సుభాషితమనీ అదే జీవనగీతై
భాషిస్తుందనీ గ్రహించగలిగిన వాడే
మేధావి వర్గం కోవలోకిజేరి కులుకుల ప్రస్థానం సాగిస్తాడు.
No comments:
Post a Comment