తోటవైపుకు తొంగిచూస్తూ
-----------------------రావెల.
ఈ తరువుల పేర్లెమిటోతెలియదు
యేపేరుతో పిలిచినా శాఖల
శిఖరాలను వంచి తలలనాడిస్తాయి.
పదాలనేమరచి ప్రవర్తిస్తున్నప్పుడు
అర్ధాలకు ఆస్కారమెక్కడుంది?
మళ్ళీ ఇంకోసారి వచ్చి
మీపుట్టుపూర్వోత్తరాలనుగురించి
వాకబు చేసే ప్రయత్నం చేస్తాను.
ఎండనకా వాననకా
ఎంత అవస్థలలోనయినా
గుండె నిబ్బరంతో గుదిగుచ్చుకుని
నిటారుగా నిలబడి వినయ సంపన్నంగా
విధేయతను ప్రకటిస్తాయి..
మళ్ళీమరోసారి యేతెంచి,
మీ క్షేమసమాచారాలను
గూర్చి సుదీర్ఘంగా అడిగి తెలుసుకుంటాను.
అనుభూతి ప్రధానమైన ఆశాలను
అప్రస్తుతంకాకుండా ప్రసంగించి వెళతాను.
ఆలోపు నాకు మీరొక్క సాయంచేసి పెట్తండి.
మీ తలలపై పక్షులకు ఆశ్రయంకలిపించి
వాటికుహూ రవాలకు,కలకూజితాలకు
తలలనూపుతూ తన్మయయత్వమందే దిశగా అడుగులేయంది.
[ఓ ఆంగ్లకవిత ప్రాతిపదికగా అల్లిన కవిత]
-----------------------రావెల.
ఈ తరువుల పేర్లెమిటోతెలియదు
యేపేరుతో పిలిచినా శాఖల
శిఖరాలను వంచి తలలనాడిస్తాయి.
పదాలనేమరచి ప్రవర్తిస్తున్నప్పుడు
అర్ధాలకు ఆస్కారమెక్కడుంది?
మళ్ళీ ఇంకోసారి వచ్చి
మీపుట్టుపూర్వోత్తరాలనుగురించి
వాకబు చేసే ప్రయత్నం చేస్తాను.
ఎండనకా వాననకా
ఎంత అవస్థలలోనయినా
గుండె నిబ్బరంతో గుదిగుచ్చుకుని
నిటారుగా నిలబడి వినయ సంపన్నంగా
విధేయతను ప్రకటిస్తాయి..
మళ్ళీమరోసారి యేతెంచి,
మీ క్షేమసమాచారాలను
గూర్చి సుదీర్ఘంగా అడిగి తెలుసుకుంటాను.
అనుభూతి ప్రధానమైన ఆశాలను
అప్రస్తుతంకాకుండా ప్రసంగించి వెళతాను.
ఆలోపు నాకు మీరొక్క సాయంచేసి పెట్తండి.
మీ తలలపై పక్షులకు ఆశ్రయంకలిపించి
వాటికుహూ రవాలకు,కలకూజితాలకు
తలలనూపుతూ తన్మయయత్వమందే దిశగా అడుగులేయంది.
[ఓ ఆంగ్లకవిత ప్రాతిపదికగా అల్లిన కవిత]
-------------------------------------------------------------------
No comments:
Post a Comment