శబ్ద శునకం
-----------------రావెల
==========================
మాఇంట్లో
ఓ శబ్ద శునకం ఉద్భవించింది.
సుప్రభాత సేవ దగ్గరనుండీ
పవళింపు సేవదాకా ప్రచార హోరుతో
నినదిస్తూనే వుంటుంది.
మొన్న మొన్నటిదాక నలుపుతెలుపుతో
సాధారణంగా దర్శనమిచ్చేది
ఇప్పుడు మారుతున్న సాంకేతికనుగుణంగా
రంగుల హంగుల్తో హంగామా చేస్తున్నది.
ఇకనిరంతరం వార్తాస్రవంతిపేరిట
చెవిటివాని దగ్గర శంఖమూదినట్లు
పొద్దస్తమానం పోసుకోలు వార్తలతో
పొద్దుపుచ్చుతూ రోజులను ఇట్టే సాగదీస్తున్నది.
ఇక ధారావాహికలపేరిట
అత్తాకోడళ్ళ మధ్య ఉన్నకాస్త
అన్యోన్యాన్ని ఇట్టే హరించివేస్తున్నది.
అల్లుడు శ్రీమహవిష్ణువనీ
అమ్మాయిని కొంగట్టుకు తిరుగుతాడనీ
పదే పదే చెప్పి ప్క్షపాతాన్ని
ఇతోధికంగా పెంచే ప్రయత్నం చేస్తున్నది.
కొడుకుని కొరకరానికొయ్యగా
కోడలు చెప్పిందే వేదాంతమంటాడని
రుసరుసలాడేలా మెట్ట వేదాంతాన్ని
వల్లించి విసిగిస్తూ వుంటుంది.
కలగాపులగంగా మన
సంస్కృతీ సంప్రదాయాలను
కట్టెలను పేర్చి
దహించుకుకుపోయేలా చేస్తున్నది.
యే చానల్ను యే దుష్ట
శక్తులు నడిపిస్తున్నాయో
ఎవ్వరెరుగని వాస్తవం గనుక
రాజకీయ విషవలయంలోకి
ననలను నెట్టి ఊపిరాడకుందా
జేసి ఉక్కిరిబిక్కిరిజేసి మనుషులను
వారి మనసులనూ గారడీ చేస్తూ ఆడుకుంటున్నది.
ఈ శునకం సమస్తమానవాళికీ శుభం కలిగించాలనె
నా ప్రగాఢమైన కామన. 29-715
==================================
-----------------రావెల
==========================
మాఇంట్లో
ఓ శబ్ద శునకం ఉద్భవించింది.
సుప్రభాత సేవ దగ్గరనుండీ
పవళింపు సేవదాకా ప్రచార హోరుతో
నినదిస్తూనే వుంటుంది.
మొన్న మొన్నటిదాక నలుపుతెలుపుతో
సాధారణంగా దర్శనమిచ్చేది
ఇప్పుడు మారుతున్న సాంకేతికనుగుణంగా
రంగుల హంగుల్తో హంగామా చేస్తున్నది.
ఇకనిరంతరం వార్తాస్రవంతిపేరిట
చెవిటివాని దగ్గర శంఖమూదినట్లు
పొద్దస్తమానం పోసుకోలు వార్తలతో
పొద్దుపుచ్చుతూ రోజులను ఇట్టే సాగదీస్తున్నది.
ఇక ధారావాహికలపేరిట
అత్తాకోడళ్ళ మధ్య ఉన్నకాస్త
అన్యోన్యాన్ని ఇట్టే హరించివేస్తున్నది.
అల్లుడు శ్రీమహవిష్ణువనీ
అమ్మాయిని కొంగట్టుకు తిరుగుతాడనీ
పదే పదే చెప్పి ప్క్షపాతాన్ని
ఇతోధికంగా పెంచే ప్రయత్నం చేస్తున్నది.
కొడుకుని కొరకరానికొయ్యగా
కోడలు చెప్పిందే వేదాంతమంటాడని
రుసరుసలాడేలా మెట్ట వేదాంతాన్ని
వల్లించి విసిగిస్తూ వుంటుంది.
కలగాపులగంగా మన
సంస్కృతీ సంప్రదాయాలను
కట్టెలను పేర్చి
దహించుకుకుపోయేలా చేస్తున్నది.
యే చానల్ను యే దుష్ట
శక్తులు నడిపిస్తున్నాయో
ఎవ్వరెరుగని వాస్తవం గనుక
రాజకీయ విషవలయంలోకి
ననలను నెట్టి ఊపిరాడకుందా
జేసి ఉక్కిరిబిక్కిరిజేసి మనుషులను
వారి మనసులనూ గారడీ చేస్తూ ఆడుకుంటున్నది.
ఈ శునకం సమస్తమానవాళికీ శుభం కలిగించాలనె
నా ప్రగాఢమైన కామన. 29-715
==================================
No comments:
Post a Comment