Friday, July 3, 2015

అదే స్వర్గ భాగ్యము
--------------==============
హరితవనంలో తరువుల చాటునుండి
తొంగిచూసే చందమామ నిన్ను నాకు
చాటుమాటుగా పరిచయం చేసి
సౌందర్య రాశివని చెప్పకయే చెప్పింది.

ఇంటిప్రక్కగా అనునిత్యం పారే సెలయేటిగలగలు
నీవు సుమధుర భాషిణివని దరహాసంతో
మనసారా హత్తుకుని మరీ చెప్పింది.

ఎదురింటి పూరిపాకలో చిన్న చిల్లునేర్పరచుకుని
ఒక్కొక్క చినుకూ తనువుపై పడి తహ తహలతో
పులకింప జేస్తుంటే  నా అధరాలను నిశ్శబ్దంగా
రసాస్వాదనచేసిన నీ అంతరంగాన్ని ఆవిష్కరింపజేసింది.


హేమంతపు చలిగాలులతో నేను వణుకుతూ వుంటే అగ్ని శిఖలా
జ్వలించి నన్ను నీ నులివెచ్చదనంతో పరవశింపజేసిన
మధురాతి మధుర క్షణాలను నా మనోపధంపై
అపురూప వర్ణచిత్రంలా గీసి ఆనందాశ్రువులను
నిరాటంకంగా రాల్చేసినా, నిలబడి  నిభాయించుకునేలా చేసింది

ఎవరు ఎవరినివదులుకుని  మనగలుతాం చెప్పు ప్రియా!!
ప్రేమమనలను భాగ్యవంతులుగా జేసి అందలమెక్కించి కులికేలా చేసింది.
భువికి నాకోసమే దిగివచ్చిన దివ్య భామినివి నీవన్న తలంపు
నన్ను అనునిత్యం ఆశావహుడినిగానిలిపి ఆశీర్వదిస్తున్నది.  

No comments:

Post a Comment