Friday, July 3, 2015

ఆ నీతి కధ
--------------
ప్రాధమిక విద్యారంభంలో
రోజుకొక శతక పద్యం
కంఠతా పట్టాను
టీకాతాత్పర్యాలతో
అవగాహనలేకున్నా
ఆయా  పద్యాలను అలానే వల్లించాను.

యవ్వనంలోకడుగిడగానే
గర్వాతిశయంతో
వాటికి విశ్రాంతినిచ్చి
గౌరవార్హం చేసాను.

నడివయసుకొచ్చేసరికి

పడిలేచిన కెరటంలా
మళ్ళీ నీతి శతకాలను
నోటగరుచుకున్నాను.

ఇప్పుడు జీవన సంధ్యాసమయంలో
ఒక్కొక్క పద్యాన్నీ
శిరోధార్యమని భావించి
మనసారా దొరకబుచ్చికొని
కీర్తనల్లా అనునిత్యం
పాడుకుంటున్నాను.
=================

No comments:

Post a Comment