Friday, July 10, 2015

దివ్య తేజస్సు
ఈ అలలసవ్వడిలో
నీ దివ్యప్రభా తేజో దీప్తి వెలువరించే 
 నవ్వులనవరత్నాలను
మంచిమనసు లాంటి  ముత్యాలనూ
యేరుకుందామని
తపనపడే నాగుండెకు
నురగలతో పరుగెట్టే
మనోజవాన్ని
దూరాలను కలిపికుట్టే
ధృతినీ ప్రసాదించి
పుణ్యం కట్టుకో
ఓ సూర్యభగవాన్!
ఓ ఆదిత్యహృదయా !!
ఎంతపుణ్యజీవివయ్యా , నీవు?
ప్రతిప్రభాతాన ఉదయారుణకిరణ స్పర్శతో
జగజ్జేగీయమానంగావెలుగొందే
నీ దివ్య స్వభావ తేజోరూపాన్ని
యే ఉపమానాలతో
సరిపోల్చి సంతృప్తిపడను ?
యే సహస్రనామాలతో
ప్రస్తుతించాలని ప్రయాసపడను 

No comments:

Post a Comment