గదిలో ఆకాశం
-----------------
గదిలోకి ఆకాశం వచ్చి
గప్ చిప్ గా వాలిపోయింది.
అక్కడే వుండాల్సిన చందమామ
ఆమె ముఖంలోకి జారి మూతి ముడుచుకుంది
తారకల్లా భువిమీదకు
దిగివచ్చిన వారంతా
సంతానరూపంలో కిమారి
సంతోష సాగరాలై మురిపించారు.
అప్పుడప్పుడూ ఉరుములూ మెరుపులూ ఉద్ధృతమై
ఉత్తేజాన్నీ ఉద్వేగాన్ని పెంచిపోషించాయి.
వాన కురిసే నల్లని మబ్బులు
బాధాతప్త హృదయాలకు
బాసటగా మేమున్నమని చెప్పి
భరోసాన్నందించాయ్.
అవి వర్షిస్తే ఆనందం ఆర్ణవమై పొంగిపొరలుతుంది.
వర్షాభావంతో మొహం చాటేస్తే దు: ఖ సాగరాలై ప్రవహిస్తాయి
ఆఫీసు పనుల్లో అలసటచెందిన అయ్యవారు
తుమ్మల్లో మొలిచిన సురీడులా ఎర్రబడుతూ ఇంటికిచేరతాడు.
అలిగిన సతిని ఆలించి పాలించి అనురాగవతిగా తీర్చిదిద్దుకుంటాడు.
అవరోధాలెన్ని యేర్పడినా ఆవిడమాత్రం అతనికి మలయమారుతమై
పిల్లగాలులను వీస్తూ పరవశింపజేస్తుంది.
పీయూష ధారనందించే ప్రియమనోహరిగా స్వీకరిస్తాడు.

No comments:
Post a Comment