Thursday, July 2, 2015

ఒక్క మనిషీ నవ్వడేం ?
-----------------------రావెల
-------------------------------
చూరు పట్టుకు వేలాడే
చుట్టపుగబ్బిలంలా
పదవిపట్టుకు వ్రేలాడే
పరహితమెరుగని నేతలా

ఒక్కమనిషీ నవ్వడేం ?

నల్లబజారులా సాగే
అధర్మపు వ్యాపారిలా
నిత్యావసరవస్తువైకూడా
నిత్యం చుక్కలనంటుకునే ధరలా

అవినీతినాశ్రయించి
అందలమెక్కికులికే
అధికారి ఇల్లాలిలా
అన్యాయాన్నంటిపెట్టుకుని
వాదించే [అ] న్యాయవాదిలా

ఒక్కమనిషీ నవ్వడేం ?



మమతా మమకారాలకు
మంచిరూపుతొలగిస్తూ
మనవతా జయపతాకను
అవనతంజేసే మకిలపరుచు మనిషిలా

ఒక్కమనిషీ నవ్వడేం ?
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

No comments:

Post a Comment