Wednesday, July 8, 2015

తమసోమా--
-------------రావెల
====================
ఎదలో చీకటి
మదిలోచీకటి
తలెత్తి యేదిశన చూసినా
తలవంపులుతెచ్చే చీకటి
అమ్మా భారతమాతా
అఖిల సుగుణసముపేతా!!
ఎక్కడ సంకెళ్ళను ఛేదించికున్న
స్వాతంత్ర భారతం ఎక్కడ?


ప్రభుత్వం ప్రతిపాదించే ప్రతిపనిలోనూ
కల్తీయే మాహారాజ్ఞియై భాషిస్తున్నది.
ప్రాణాన్ని రక్షించే మందులలోగూడా
జీవితాన్ని హరించే లాభదృష్టి
నాణ్యతను కోల్పోయేలా చూస్తున్నది .

వంటలకు వాడేనూనెల్లో
వాహనాలనూనెతోకల్తీ
మేలిరకపు వెన్నపూసలో
మృతపశువులకొవ్వుతో కల్తీ!!

 చీడ పురుగులను చంపాల్సినమందులు
చేలగట్లపై రైతన్నలను పొట్టనబెట్టుకుంటున్నాయ్
మద్యపానపు సీసాల్లో
మత్తుకోసం విషపదార్ధాల మేళవింపు.

రాజకీయ రణరంగంలో
 రావణుల పాత్ర అధికమయింది.
అగ్నిపునీత సీతలకు
ఆక్రందనే వరమై నిలిచింది.

సోషలిజం సూర్యుడింకా
మనపొద్దునపొడవలేదు
తారతమ్యాల తమస్సులింకా
అంతరించిన జాడలేదు.

No comments:

Post a Comment