Tuesday, July 14, 2015

నన్ను మరచిపో
కానీ నీవిచ్చిన వాగ్దానాలను విస్మరించకు.
నన్ను ప్రేమగా చుంబించు
పాముల బుసకొట్టే ప్రయత్నం మానుకో.

సంగమలా లీనమయేందుకు
నన్ను వలచు
పాయల్లా విడిపోయేందుకు
ప్రణాళికలను రచించకు.

సంతొషంగా సంసార సాగరాన్ని మధించు
కానీ నాసుఖాన్ని గరళంలా పరిమార్చకు.

చీకటిని పారద్రోలే తలంపులతో చిరుదివ్వెను వెలిగించు
నా బ్రదుకునంధకార బంధురంచేసే ప్రయత్నాలు విరమించు.
నన్ను ఆకాశమార్గంలోకి పయనించే
గాలిపటాన్ని జేసి ఆడించకు.
------------------------------------------------

No comments:

Post a Comment