హరిత క్షేత్ర ధాత్రి
ఎందుకో ఈబొమ్మెపుడూ
ఓటమిదిశగానే పరుగులెడుతుంది
ఎంతో శ్రమకోర్చి స్వేదం వెలార్చి
రూపొందించినా
తిరుగు టపాలోతిరిగొచ్చిన ఫిలిం
బాక్సులా
వెలవెలబోతూనే వుంటుంది
ప్రభుత్వ కనుసన్నల్లో పంపిణీ
అయే
తాలు విత్తనాల సంచుల్లా ఎలాతెలాబోతుంది
ఆకాశానికి అనవరతం వేలాడేలా
కళ్ళను అతికించి వానచినుకులకోసం
పడిగాపులు గాచే రైతన్నల కుటుంబాల్లా
దయాదాక్షిణ్యాలుమరచి దారుణ మారణ
మానవ హోమం
జరుపుతున్న వరుణ రాక్షసుడి కార్యకలాపాల్లా
ఈ తీరు ఇలాగే కొనసాగితే
కొన్నాళ్ళకు కన్నీళ్లుకూడా కరువయేప్రమాదం
ముందురోజుల్లో పొంచి వుంటుంది
సుమా
అని ప్రకృతి హెచ్చరిస్తున్నాదాఖలాలు
యెన్నెన్నో
ఒకప్పుడు వసంతర్తు లో
వికసించే తరువులా నిగనిగలాడుతూ
ముక్కు పచ్చలారకుండా
యేపుగా ఎదిగిన పైరు ప్రపంచం
ఇప్పుడు శిశిరంలో రాలడానికి
సిద్ధమైన ఒగుడాకులా
స్రుక్కి సోలి ఓపిక నశించిన
దానిలా
హరిత క్షేత్ర ధాత్రి దర్శనమిస్తున్నది
"---------------------------------------
No comments:
Post a Comment