Saturday, July 4, 2015

అసాధారణం
----------------------
నాలోతడిసిముద్దయిన జ్ఞాపకాలు
ఎంతగా నగిషీ తనాన్ని సంతరించుకున్నాయో గమనించు,
టళ తళా మెరిసిపోతూ , ధగద్ధగాయమానంగా మురిసిపోతూన్నాయ్.
నన్ను రాత్రంతా కలవళపెట్టి కలతబారేలా చేసిన కలలు
ఎంతగా ప్రకాశిస్తున్నాయో అవధరించు.
కన్నీటితెరల్లోగూడా కమనీయ దృశ్యాల్లా కళ కళలాడుతూ
వెలుగు వెన్నెలజిలుగులను విస్తృతంగా వెలారుస్తున్నాయ్.

ఒక విలువైన సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేను
ఓ వినిర్మల దృక్పధాన్ని విజ్ఞాన తెమ్మెరలా మలచుకుని
ఒడ్డుకుచేరేందుకు ప్రయాసపడుతున్న తరంగాల్లా
తలవంచుకుని నడక ప్రవాహ ధృతిలో సాగిస్తున్న వైమనస్యం నాది.
అచ్చోసిన ఆంబోతుల్లా కొన్ని అక్షర సిం హాలు వెంటబడి
మానవతనువేధిస్తూ అంతుబట్టనిరోగంలా పట్టి పీడిస్తున్నాయ్.
ఇదేసమ్యంలో కొన్ని పతాక శీర్షికలకెక్కి తమత వైదుష్యాన్ని
జగతికంతటికీ అవగతం చేయాలని తహతహ పడుతున్నాయ్.
కలాన్ని కళకళలాడింపజేసే ప్రక్రి యలో తలమునకలౌతూ
కరకుదనాన్ని కాదనుకుని కరుణారసస్ఫూర్తికే నిరంతరం అంకితమౌతూ
అభినందన చందనలందుకుని గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాయ్.
================================================

No comments:

Post a Comment