ప్రణయినీ
--------------
కనుచూపుమేరలో నీవు
కదలాడుతున్నంతకాలం
కందళిత సుధాతరంగ
మాహృదయం
సురభిళపరిమళమై
నీవు ప్రసరించినంతకాలం
సుందర సుమధురస్వప్నం
నాపరువం
మృదూక్తులను నువ్వు
మనోజ్ఞంగా వల్లించినంతసేపూ
కన్ననికోయిలల కవితాగానం
నాజీవనరాగం.
ప్రబంధాల ప్రవాహసదృశం
కధానికల కల్ హారం
నవకవితాఉషోదయం
నా ప్రణయాంతరంగం
అందుకే నీ జ్ఞాపకం
నాకు చర్వితచర్వణ వేదం
సంగీత సాహిత్యపు
సమలంకృత సామగానం
మధురోహల మృదుభాషిత
మణిచందనం మన ప్రణయం
--------------
కనుచూపుమేరలో నీవు
కదలాడుతున్నంతకాలం
కందళిత సుధాతరంగ
మాహృదయం
సురభిళపరిమళమై
నీవు ప్రసరించినంతకాలం
సుందర సుమధురస్వప్నం
నాపరువం
మృదూక్తులను నువ్వు
మనోజ్ఞంగా వల్లించినంతసేపూ
కన్ననికోయిలల కవితాగానం
నాజీవనరాగం.
ప్రబంధాల ప్రవాహసదృశం
కధానికల కల్ హారం
నవకవితాఉషోదయం
నా ప్రణయాంతరంగం
అందుకే నీ జ్ఞాపకం
నాకు చర్వితచర్వణ వేదం
సంగీత సాహిత్యపు
సమలంకృత సామగానం
మధురోహల మృదుభాషిత
మణిచందనం మన ప్రణయం
No comments:
Post a Comment