Tuesday, July 7, 2015

గణనం
---------రావెల

అస్తమించే సూర్యుడిని చిత్రించేందుకు
అవసరమైన రంగులన్నింటినీ ఒకచోట చేరుస్తున్నాను.
ఉవ్వెత్తున ఎగసిపడే కడలితరంగాలను
కళాత్మక ధ్వ నులను వినేందుకు వీలుగా
కర్ణపుటాలను సమాయత్తం చేస్తున్నాను.
మలయమారుతం వీచేటప్పుడు వినబడే మందహాసాన్ని
ప్రతిభాసమన్వితంగా భద్రపరచుకునే ట్రుంకు పెట్టెలను సిద్ధం చేస్తున్నాను,
 అందమైఅ చందమామను అక్కునచేర్చుకుని ఆనందపడే
తారాతోరణాలను గబ్\నించేందుకు తగు యంత్రాలను
తయారుచేసే పనిలో పూర్తిగా నిమగ్నమై వున్నాను.
బడబానలపు తీక్షణను తట్టుకోవడానికి
సమశీతోష్ణపు గదులను సమాయత్తం చేసుకుంటున్నాను.


ఆనింటినీ దగారగా చేర్చుకుని సంకలనం చేయడనికి తయారవు.
నీజీవన యానానికి సరయిన భాష్యం
వెతుక్కునే శ్రమ నీకు తప్పుతుందని క్షుణ్ణంగా తెలుసుకో!

No comments:

Post a Comment