Wednesday, July 15, 2015

ఎచటికి పోదా మీరాత్రి ?
--------------------------------------
వెలుగు వెంట నడిచే శశికిరణంలా నీవు
నదివెంట పరుగెట్టే తరంగ ధృతిలా నేను
జ్యోత్స్నా భిసారికలా ఎదురుతెన్నులతోనీవు
మై మరపించే లలితగీతంలా మృదు మధుర స్వరంతో నేను
పడుతూ లేస్తూ పరుగెడుతూ నిదానం గా అడుగు వెంట
అడుగులను వేసుకుంటూ పాదచారిలా, సాగిపోతూ నేను
గుండెను దిటవు చేసుకుని
శ్వాసక్రియను స్వచ్చ్సంగా మరల్చుకుని
ఎచటికిపోదామీ రాత్రి ?
దిగంతాలదరికి దిశానిర్దేశనంకోసమా?

అగాధాల అంచులచెంతకు అకుంఠిత జ్ఞానోపదేశానికా--?
============================

No comments:

Post a Comment